Thursday, January 23, 2025

యాదాద్రిలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి ఈరోజు ఉదయం నుంచ భారీగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి 5గంటల సమంయం పడుతుండగా, రూ.150 ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పండుతోంది. స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు భారీగా బారులు తీరారు. సత్యనారాయణ స్వామి వ్రతాల వద్ద కూడా భక్తులు కిక్కిరిసిపోయారు.

ఇక, వేములవాడ రాజన్న ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News