తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 21,784 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 10,681 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.1.74 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి భక్తులకు ఈ రోజు నుంచి 14వరకు బ్రహ్మోత్సవాల దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల భక్తులకు ఉచితంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ఘాట్ రోడ్డులో వెకువజామున 2గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు వాహనాలను అనుమతించనున్నారు. భక్తులకు నిత్యం 3.5లక్షల లడ్డూలు సిద్ధం చేసినట్లు తెలిపారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.
Huge devotees visited Tirumala Srivari Temple