- Advertisement -
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. శనివారం తిరుమల శ్రీవారిని 41,463 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 21,975 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.46 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.
Huge Devotees visited Tirumala Temple
- Advertisement -