తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 27,453 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 11,565 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.73 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని వెంట తీసుకురావాలని టీటీడీ పేర్కొంది. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరింది.వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరించలేదని టిటిడి స్పష్టం చేసింది. కోవిడ్ తగ్గిన తర్వాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
Huge devotees visited Tirumala Temple