Wednesday, April 2, 2025

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి..

- Advertisement -
- Advertisement -

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో నిల్చుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వామివారి దర్శనార్థం యాత్రికులు తరలివస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News