ప్రస్తుతం అమెజాన్‌లో హాలిడే ఫోన్ ఫెస్ట్ కొనసాగుతోంది. డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 2 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో అమెజాన్ చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్లు ఇస్తోంది. ఇందులో భాగంగా సేల్‌లో, కర్వ్డ్ డిస్‌ప్లేతో హానర్ ఫోన్‌లపై కూడా అద్భుతమైన డీల్ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకునవారికి ఇది సరైన సమయం. ఇకపోతే ఈ అమెజాన్ సేల్ లో డిస్కౌంట్ తో వస్తున్న హానర్ 200 5జీ ఫోన్ ఆఫర్, స్పెసిఫికేషన్స్ గురుంచి తెలుసుకుందాం.
ఆఫర్
హానర్ 200 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ + 256జీబీ వేరియంట్ అమెజాన్‌లో ధర రూ. 39,999కి లభిస్తోంది. అయితే, 33 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ రూ. 26,999కే కొనుగోలు చేయొచ్చు. అంతే కాకుండా.. అమెజాన్‌లో వినియోగదారులకు రూ.3,000 కూపన్ కూడా ఇస్తున్నారు. దీంతో మళ్ళీ ఈ ఫోన్ ధర రూ. 23,999కి తగ్గుతుంది. అంటే కస్టమర్లు చాలా తక్కువ ధరకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో ఈ ఫోన్ నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా కొనొచ్చు. పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.24,300 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఫోన్ 12జీబీ + 512 జీబీ వేరియంట్‌లో కూడా వస్తుంది. కానీ, దీనిపై కూపన్ రాయితీ ఇవ్వడం లేదు.
స్పెసిఫికేషన్‌లు
హానర్ 200 5జీ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్కుఅల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్OS 8.0 OSని కలిగి ఉంది.
ఇక ఫోటోగ్రఫీ కోసం.. హానర్ 200 5జీలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. అయితే, ఈ మోడల్ సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం.. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. చివరికి బ్యాటరి విషయానికి వస్తే ఈ ఫోన్ బ్యాటరీ 5,200mAh. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.