Monday, March 10, 2025

ఈ మోటో ఫోన్ పై డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 128జీబీ స్టోరేజ్..

- Advertisement -
- Advertisement -

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి.మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్ మీకు సరైనది. ఈ డీల్ లో ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ మోటోరోలా మోటో G64 5G ఫోన్ పై భారీ తగ్గింపు ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్, ధర స్పెసిఫికేషన్ చూద్దాం.

మోటో G64 5G ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 17,999 గా ఉంది. అయితే 16 శాతం తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ను రూ. 14,999 కు కొనుగోలు చేయొచ్చు.అంతేకాకుండా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపును కూడా పొందవచ్చు. తర్వాత మోటో G64 5G ఫోన్ ధర రూ.12,999కే వస్తుంది. ఇది మాత్రమే కాదు.. ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.14,999 వరకు తగ్గింపును పొందవచ్చు.

స్పెసిఫికేషన్‌లు

మోటో G64 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల పూర్తి-HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 చిప్‌తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) మద్దతుతో మోటో G64 5G Android 14లో నడుస్తుంది. ఒక Android OS అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తోంది.

ఇక కెమెరా విషయానికి వస్తే..మోటో G64 5G OIS, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్, f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. దీనితో మీరు మాక్రో ఫోటోలను కూడా తీయవచ్చు. ముందు భాగంలో ఫోన్ f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటో G64 5G మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా (1TB వరకు) విస్తరించవచ్చు. బ్యాటరీ గురుంచి మాట్లాడితే.. ఇది 33W ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News