Thursday, January 23, 2025

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ప్రకటించి వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టూవీలర్‌పై 80 శాతం, ఫోర్ వీ లర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలానాలో 50 శాతం తగ్గింపు ఇచ్చింది. అదే విధంగా ఆర్‌టిసి బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రా యితీ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ చలానాల చె ల్లింపునకు అవకాశం కల్పించారు. చలాన్ల ను ఆన్‌లైన్ తో పాటు మీ సేవ కేంద్రాల్లో నూ చెల్లించవచ్చు.

2022, మార్చి 31 నా టికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండిం గ్ లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గతేడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకు 75 శా తం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇ చ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించగా, కేవలం 45 రోజుల వ్యవధిలోనే రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ పెండింగ్‌ల భారం పెరిగిపోయింది. గత నెలాఖరు వరకూ పెండింగ్ చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుందని అంచ నా. ఈ నేపథ్యంలో  మరోమారు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది.

నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుతం సాం కేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్ప డే వారిని సులువుగా గుర్తించి చలాన్లు విధిస్తున్నారు. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్ లో ఉండగా ఈ రాయితీతో అవి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నా రు. ఈ తగ్గింపులను డిసెంబర్ 30న (శనివారం) తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో నిర్వహించే మెగా జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో ఉంచుకుని నిర్ణయించినట్లు సమాచారం. వాహనదారులు ’https://echallan.tspolice.gov.in/publicview/’వెబ్‌సైట్ ద్వారా తమ వాహ నాలపై ఎంత చలానా పెండింగ్‌లో ఉందో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా చలాన్లు సైతం చెల్లించవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News