Tuesday, January 21, 2025

బంపర్ ఆఫర్.. ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్

- Advertisement -
- Advertisement -

తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇది మీకు సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రిస్మస్‌కు ముందు అమెజాన్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా రియల్ మీ కంపెనీ ఫోన్ రియల్ మీ నాజ్రో N61 ఈ జాబితాలో ఉంది. తగ్గింపు తర్వాత కస్టమర్లు ఈ ఫోన్‌ను కేవలం రూ.7 వేల లోపు కొనుగోలు చేయొచ్చు.

ఇక ఈ ఫోన్ డీల్ గురుంచి మాట్లాడితే.. 4GB + 64GB వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.8,999కి బదులుగా రూ.7,498కి అందుబాటులో ఉంది. ఇక్కడ వినియోగదారులు నేరుగా 17 శాతం తగ్గింపును పొందుతారు. అంతేకాకుండా.. కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 కూపన్ తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ను రూ.6,498 కే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద అమెజాన్‌లో కస్టమర్ల రూ. 7,100 వరకు తగ్గింపు కూడా పొందొచ్చు. కాగా, ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్‌లో కూడా వస్తుంది.

 

స్పెసిఫికేషన్‌లు

రియల్ మీ నాజ్రో N61 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 560nits వరకు బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ప్రాసెసర్‌పై నడుస్తుంది. గరిష్టంగా 6జిబి రామ్, 128జిబి వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఫోన్ మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరణకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారిత రియల్ మీ UI 4.0 పై రన్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం.. రియల్ మీ నాజ్రో N61 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 32-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు కెమెరాలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. కాగా, ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News