మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు రూ.15,000 నుండి రూ. 20,000 రూపాయల మధ్య కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ లో అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్13 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ఉంది. ఈ క్రమంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలను చూద్దాం.
ఆఫర్
గ్రాఫైట్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఓషన్ టీల్, ప్రిజం గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో వస్తున్న ఈ రెడ్‌మీ నోట్ 13 5G స్మార్ట్ ఫోన్ 12జీబీ ర్యామ్ 256జీబీ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 24,999 కి లభిస్తోంది. అయితే 28 శాతం తగ్గింపు తర్వాత దీని కేవలం రూ. 17,973కే కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా.. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 13 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అల్మొడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13పై ఫోన్ రన్ అవుతుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ను అమర్చారు.
ఇక ఫోటోగ్రఫీ కోసం.. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో అద్భుతమైన 108MP ప్రధాన సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.బాటరీ గురుంచి చెప్పాలంటే.. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జర్, టైప్-సి కనెక్టివిటీ కూడా బాక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా.. ఫోన్ IP54 రేటింగ్‌ను కూడా పొందుతుంది. ఫోన్ డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సపోర్ట్ చేస్తుంది.