ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ పై భారీ తగ్గింపు అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికీ ఈ ఆఫర్ సరైనది. అయితే, ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 2023లో మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్ల గురుంచి తెలుసుకుందాం.
ఆఫర్
శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు అందిస్తోంది. అయితే, 6జీబీ ర్యామ్, 128 జీబీ కలిగిన దాని బేస్ మోడల్ ధర రూ.19,999 ఉంటె, ఆఫర్ లో భాగంగా దీన్ని రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే.. ఈ ఫోన్ పై ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా.. అమెజాన్ ఈ ఫోన్‌పై రూ.14,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ M35స్మార్ట్ ఫోన్ శాంసంగ్ Exynos 1380 ప్రాసెసర్ అమర్చారు. ఈ ఫోన్ 6.62 అంగుళాల పూర్తి HD + సూపర్ అల్మొడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 25W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇక ఫోటోగ్రఫి గురుంచి మాట్లాడితే..శాంసంగ్ గెలాక్సీ M3 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది OISతో 50 MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం.. 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.