ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో కంపెనీ బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ వివో T3x 5జిని T సిరీస్‌లో గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఫోన్ అన్ని వేరియంట్లకు మీద రూ.1000 ధర తగ్గింపును ప్రకటించింది. ఒకవేళ మీరు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ తీసుకోవాలని చుస్తేయ్ ఇది మీకు సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఆఫర్ లో కస్టమర్‌లు ఏ వేరియంట్‌ను ఏ ధరకు కొనుగోలు చేయొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫర్
వివో T3x 5జి ఆఫర్ లో ధర తగ్గింపు తర్వాత.. ఇప్పుడు వివో T3x 5జి 4జీబీ + 128జీబీ మోడల్ ధర రూ.12,499గా, 6జీబీ + 128జిబి మోడల్ ధర రూ.13,999గా, 8జిబి + 128 జిబి మోడల్ ధర రూ.15,499గా ఉంది. ఈ ఫోన్ వివో, ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో కొత్త ధరలకు అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్‌లు
వివో T3x 5జి 6.72-అంగుళాల పూర్తి-HD (1,080×2,408 పిక్సెల్‌లు) ఎల్సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 nits పీక్ బ్రైట్‌నెస్, 120Hz 39 రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4Nm-స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్ టచ్ OS 14పై రన్ అవుతుంది. ఇక కెమెరా గురుంచి మాట్లాడితే.. ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ, వీడియో చాట్ కోసం.. 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా..వివో T3x 5జి 5జి, వై ఫై, బ్లూటూత్ 5.1, జిపియస్, ఓటీజి, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. బ్యాటరీ గురుంచి చెప్పాలంటే.. వివో T3x 5జి బ్యాటరీ 6,000mAh తో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.