Thursday, January 23, 2025

బిఆర్ఎస్ కు మద్దతుగా భారీ విరాళం….

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట మాల సంఘం ఆధ్వర్యంలో రూ.51 వేల విరాళం….

సిద్దిపేట న్యూస్: సిద్దిపేట పట్టణ అంబేడ్కర్ మాల కుల సంఘం కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మి ఆనంద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ గ్యాదరి రవీందర్, సంఘం అధ్యక్షులు భూమయ్య, గ్యాదరి మహాంకాళిలు 51 వేల నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చారు.  సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్పు చేయడం సిద్దిపేట వాసులుగా గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ కంచుకోటగా స్వరాష్ట్రం సాదించి నేడు జాతీయ పార్టీగా అవతరించడం ఇక్కడి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా నగదు ను మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డికి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News