Monday, November 25, 2024

కొత్త సంవత్సర వేడుకల్లో… భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఎండిఎంఏ, హెరాయిన్, బ్రౌన్‌షూగర్ పట్టివేత
మూడు కమిషనరేట్లలో పట్టుకున్న పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః  కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు పోలీసులు ఎంతగా నిఘా పెట్టినా కూడా పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌పై నిఘా పెట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నవారు, విక్రయించే వారు పట్టుబడ్డారు. రాజేంద్రనగర్‌లో న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ కోసం ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్న పాఫ్ట్‌వేర్ ఉద్యోగి, డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చిన ఇద్దరిని రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నంబర్ 290 వద్ద ఉన్న ప్రొవిడెంట్ కేన్వర్డ్ అపార్ట్మెంట్లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంధ్య ఉంటోంది. కొత్త సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి చేసుకునేందుకు డ్రగ్స్‌ను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిసింది, బాలానగర్, రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు కలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్‌ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్‌ను అర్జున్ బెంగళూరు నుంచి తీసుకుని వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

జూబ్లీహిల్స్‌లో…
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విక్రయించేందుకు వచ్చిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎండిఎంఏ 100గ్రాములు, 29 మినీ బ్రౌన్ షుగర్,రెండు గ్రాముల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.7,50,000 ఉంటుంది. ఎపిలోని గుంటూరు జిల్లా, తెనాలి, మట్టం బజార్‌కు చెందిన సూరేలీలా నవీన్ సాయి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, ఎపిలోని ఒంగోలు జిల్లా, ఇంకోట్లు గ్రామానికి చెందిన బొర్రా వీరసాయితేజ సెల్ఫ్ డ్రైవిగ్ కార్ వ్యాపారం చేస్తున్నాడు.

ఇద్దరు కలిసి మణికొండలోని పుప్పాలగూడ, శిరిడిసాయినగర్‌లోని జెఎస్ ఆర్చిడ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. నవీన్‌సాయి పంజాబ్‌లోని లవ్లీప్రొఫేషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మెకానిక్ బ్రాంచ్‌లో చేశాడు. అక్కడ చదువుకునే సమయంలో డ్రగ్స్‌కు బానిసగా మారాడు. డ్రగ్స్ కోసం లోన్ యాప్ప్‌లో అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి అప్పులు తీర్చమని ఇచ్చిన వారు వేధిస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటుండడంతో అప్పులు తీర్చేందుకు డ్రగ్స్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్లాన్ వేశారు.

దీనికిగా ను ఢిల్లీకి చెందిన డ్రగ్స్ విక్రేతను సంప్రదించాడు. అతడి వద్ద నుంచి ఎండిఎంఏ గ్రాముకు రూ.2,000లకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.6,000 నుంచి రూ.8,000లకు విక్రయిస్తున్నాడు. కొకైన్‌ను గ్రాముకు రూ.10,000లకు కొనుగోలు చేసి రూ.17,000లకు విక్రయిస్తున్నాడు. బ్రౌన్ షుగర్‌ను రూ.5,000లకు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ.10,000లకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36వద్దకు వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

మీర్‌పేటలో…
డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎస్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాములు హెరాయిన్, రూ.10వేల నగదు, బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రం నుంచి హెరాయిన్ తీసుకుని వచ్చి ఇక్కడ కొత్త సంవత్సర వేడుకల్లో ఎక్కువ ధరకు విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News