Sunday, December 22, 2024

ఉన్నది రెండే బల్బులు… కరెంటు బిల్లు రూ.99,464

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మద్దూరు: ధూలిమిట్ట మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడికి అక్టోబర్ నెలకు సంబంధించి రూ. 99,464 వేల భారీ విద్యుత్ బిల్లు వచ్చింది. బిల్లును చూసి షాక్ అయినా ఆ ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే..ధూలిమిట్ట మం డల కేంద్రంలోని గుంజె రాములు ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అలాంటి ఇంటికి ఈ నెల సెప్టెంబర్ కరెంట్ బిల్లును అక్టోబర్‌లో ముద్రించగా దాదాపు రూ.1 లక్ష రూపాయలు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండు బల్బులు ఉపయోగిస్తున్న ఇంటికి ఇంత పెద్దమొత్తంలో కరెంట్ బిల్లు రావడం పట్ల విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని రాములు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News