Friday, November 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోయిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 9 మంది మావోయిస్టులు మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ప్రకటించారు. దంతెవాడ, బీజీపూర్ జిల్లాల సరిహద్దుల వెంబడి ఉన్న అడవులలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాల్పుల పోరు ప్రారంభమైనట్లు జస్టర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ పి తెలిపారు. జిల్లా రిజర్వే గార్డు, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌లతో కూడిన భద్రతా దళాల ఉమ్మడి బృందం మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతుండగా కాల్పుల పోరు జరిగినట్లు ఆయన చెప్పారు.

కొన్ని గంటల పాటు జరిగిన కాల్పుల పోరు అనంతరం యూనిఫాం ధరించిన 9 మంది మావోయిస్టుల మృతదేహాలు అడవిలో లభించినట్లు ఆయన చెప్పారు. ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు ఆయన తెలిపారు. ఈ కాల్పుల పోరులో భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. బస్తర్ ప్రాంతంలో దంతెవాడ, బీజాపూర్‌తోసహా ఏడు జిల్లాలు ఉన్నాయి. నేటి సంఘటనతో ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో మొత్తం 154 మంది మావోయిస్టులు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News