Friday, January 3, 2025

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. రాష్టట్ర గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ కలిసి సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరుగుతుందని.. మరికొంతమంది మావోయిస్టులు గాయపడినట్లు తెలుస్తుందని అధికారులు చెప్పారు. మృతుల్లో మావోయిస్టు ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్నతోపాటు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News