Wednesday, January 22, 2025

కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒక్కరోజులో కేంద్ర బడ్జెట్ వస్తుందనగా ఇది నిర్మలంగా ఉంటుందా? కరకుగా మారుతుందా? అనే భయాందోళనలు దేశంలోని కోట్లాది సామాన్యులలో తలెత్తాయి. ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలు, సామాన్యులు, వేతన జీవులు బడ్జెట్ భారం గురించి పలు విధాలుగా విశ్లేషించుకుంటున్నారు. బడ్జెట్‌కు ముందు జనంలో నెలకొన్న అభిప్రాయాల గురించి విస్తృత సర్వే నిర్వహించారు. ఆ దాయపన్ను భారం తగ్గాలని, ఇప్పుడున్న దుర్భర స్థితి నుంచి వి ముక్తి దక్కాలని సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది వర కూ అభిప్రాయపడ్డారు. 2017 18 నుంచి ఇప్పటివరకూ వ్యక్తిగత పన్నుల రేట్లలో ఎటువంటి మార్పులు లేవు. అయితే సరళీకృత పన్నుల వ్యవస్థను 2020 21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టా రు. అయితే ఆదాయ పన్నుల వ్యవస్థలో ఎటువంటి మార్పులు తలపెట్టలేదు. ఈసారి బడ్జెట్‌లో రూ 20 లక్షలకు పైగా ఆదాయం ఉ న్న వారికి 30 శాతం టాక్స్ స్లాబ్‌ను పునః పరిశీలించాలని అత్యధికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ కోణంలో ఈసారి బడ్జెట్‌లో తాము తొంగిచూస్తామన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నులు చెల్లించే వారికి ఇప్పటివరకూ అత్యధిక స్లాబ్ రేటు పడుతోంది. ఇది దాదాపుగా 42.744 శాతంగా ఉంది. కార్పోరేట్ పన్ను 25 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది. దీనిని ఖచ్చితంగా తగ్గించాల్సి ఉందని. వ్యక్తిగత ఆదాయపన్నును కార్పొరేట్ టాక్స్ రేట్ల స్థాయితో సరిపోల్చి చూడాలని పలువురు సూచించారు. కనీసం ఇది స్లాబ్‌గా 30 శా తంగా ఉండాలని లేదా వ్యక్తిగత ఆదాయ పన్ను వర్తించే స్థాయిని రూ 10,00,000 నుంచి రూ 20,00,000కి పెంచాల్సి ఉందని డె లోయిటి ఇండియాలో భాగస్వామి అయిన సరస్వతి కస్తూరిరంగన్ తెలిపారు. సర్‌చార్జి రేట్లను తగ్గించాల్సి ఉందని దాదాపు 5 శాతం మందికోరారు. పది శాతం మంది ఆరోగ్య బీమా ప్రీమియంలో తగ్గింపు కావాలని కోరారు. పన్ను చెల్లింపు దారులు అయిన వేతన ఉద్యోగుల నుంచి ప్రామాణిక కోత ఇప్పుడున్న రూ 50000 నుంచి రూ 1 లక్షకు పెంచాలని 22 శాతం మంది కోరారు. రూ 5 లక్షల ఆదాయం వరకూ ఉన్న వారికి పన్నుల నుంచి మినహాయించాలి. ఇక రూ 5 లక్షలు ఆదాయం దాటిన వారిని 20 శాతం పన్నుల జాబితాలో చేర్చవచ్చునని అత్యధికులు సూచించారు.

ఈ విధంగా మొత్తం మీద పన్నుల వ్యవస్థను క్రమబద్ధీకరించవచ్చునని తెలిపారు. ఇప్పుడు ఏటా రూ 25 లక్షల వరకూ సంపాదించుకునే వారికి ఉన్న పన్నులు విలువ మొత్తం రూ 5,85000 వరకూ ఉంది. ఇది ఈసారి రూ 4,81000కు తగ్గవచ్చు. ఈ విధంగా వ్యక్తిగతంగా చూస్తే రూ 1,04,000 వరకూ ఆదా అవుతుంది. సర్‌చార్జీతో నిమిత్తం లేని ఆదా ఇది అని నిపుణులు తెలిపారు. ఆదాయ పన్ను విషయంలో మార్పులకు సంబంధించి సెక్షన్ 80 సిలో పెరుగుదలను సామాన్యుడు కోరుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న పరిమితి రూ 1.5 లక్షల నుంచి మార్చాలని సూచించారు. ప్రామాణిక తగ్గింపుల రేటు ఇప్పుడున్న రూ 50 వేల నుంచి రూ 1లక్షకు పెంచాలని కోరుతున్నారు.

అత్యంత సంపన్నులపై పన్నులకు ఇదే అదును

పలు విమర్శలు తలెత్తడం, దేశంలో సంపద సరైన రీతిలో పంపిణీ కాలేదనే అంతర్జాతీయ విశ్లేషణల నడుమ ఈసారి బడ్జెట్‌లో అయినా అత్యంత సంపన్నులపై పన్నులు విధించి , మధ్యతరగతి జీవులకు పన్నులు తగ్గించే పరిస్థితి రావాలని అత్యధికులు కోరారు. ఈ విధంగా పన్నుల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని సూచించారు. కార్పొరేట్ల స్థాయిని కూడా మించి దేశ సంపదలో అత్యధిక శాతం తమ వద్ద స్థిరపర్చుకున్న వర్గాలపై పన్నుల శాతం పెంచితే దేశంలో కోట్లాది మంది అవసరం అయిన నిత్యావసర వైద్యం, విద్యా ఇతరత్రా వ్యయాలకు అయ్యే బడ్జెట్ కేటాయింపులు చాలా వరకూ తీరుతాయని ప్రపంచ స్థాయి సర్వేలో వెల్లడైన దశలో ఈ దిశలో ప్రభుత్వం కన్నేసే ధైర్యం చేస్తుందా? చేస్తే ఇది మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

అత్యధిక వాడకపు వస్తువులపై జిఎస్‌టి తగ్గింపు
ఈసారి బడ్జెట్‌లో అయినా రోజువారి దైనందిన వాడకపు వస్తువులపై పన్నులు తగ్గించాలని 9 శాతం మంది కోరుతున్నారు. ఈ దిశలో జిఎస్‌టి మండలితో చర్చించాలని సూచించారు. దైనందిన వస్తువులపై పన్నులు తగ్గించడం ద్వారా సామాన్యుడి ఇంటింటి బడ్జెట్ భారంలో కొంత శాతం అయినా తగ్గుతుందని అత్యధికులు తెలిపారు. సార్వత్రిక వాడకాలలో లగ్జరీ వస్తువులు, సాధారణ దైనందిన వాడకాలు, అత్యవసర వాడకాలు, విలాసవంతపు వస్తువులకు సంబంధించిన వాటిపై పన్ను రేట్లను సరైన విధంగా సవరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీటి వాడకందార్ల స్థాయిని బట్టి వారికి వ్యయ భారం మారుతుందని తెలిపారు.

ద్రవ్యోల్బణం భయాల నడుమ పరిస్థితి
ఇంతకు ముందు కోవిడ్ తరువాతి లాక్‌డౌన్లు, పూర్తిగా దిగిరాని అంతర్జాతీయ స్థాయి ముడిచమురు ధరలు, వివిధ దేశాలలో ఆర్థిక పరిస్థితి నడుమ ద్రవ్యోల్బణం భయాల నడుమనే సామాన్యుడు ముందుకు బడ్జెట్ వస్తోంది. ఆదాయపు పన్నులో మౌలిక మినహాయింపు పరిమితిని పెంచుతారని ప్రజలు భావిస్తున్నారు. లే ఆఫ్‌లు, ఆర్థిక మాంద్యాల క్రీనీడలతో బడ్జెట్ గణాంకాలు బూచిలు అవుతున్నాయి. మొబైల్ ఫోన్ల ముడి భాగాలపై సుంకాలను హేతుబద్ధీకరించాలని , వీటిని సమకూర్చే ప్రక్రియపై కూడా పన్నులు తగ్గించాల్సి ఉందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ) కోరింది. కొద్ది పాటి టారీఫ్‌లను ఎత్తివేయాలని తెలిపారు. అంతేకాకుండా ఇన్‌పుట్స్ సుంకాలన్నింటిని తొలిగించివేయాల్సి ఉందని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News