Friday, December 20, 2024

పాక్ సియాల్‌కోట్ మిలిటరీ డిపో వద్ద భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

Huge explosion at Pak Sialkot military depot

 

లాహోర్ : పాకిస్థాన్ లోని సియాల్‌కోట్ మిలిటరీ డిపో వద్ద ప్రమాదవశాత్తు ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. షార్ట్ సర్కూట్ కారణంగా సియాల్‌కోట్ గారిసన్ సమీపంలో మందుగుండు సామగ్రి డిపోలో అకస్మాత్తుగా మంటల చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు అదుపు లోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ ఆర్మీ మీడియా విభాగం వెల్లడించింది. పేలుడుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. భారీగా మంటలు, పొగ దృశ్యాలు కనిపిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News