Friday, December 27, 2024

ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా పట్టణంలో భారీ పేలుడు..

- Advertisement -
- Advertisement -

కీవ్: ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా నగరం బ్రయాన్స్ లో సోమవారం తెల్లవారు జామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చమురు డిపో ఉంది. ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. రష్యాలోని చమురు సరఫరా కంపెనీ ట్రాన్స్‌నెఫ్ట్‌కు సంబంధించిన పైపులైన్లు కూడా అక్కడ ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ వైపు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడ లేదు. ఈ పట్టణంలో సుమారు 4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. రష్యా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన కీవ్ పోస్ట్ పత్రిక మాత్రం రెండు చమురు డిపోలు దహనమవుతున్నాయని కథనంలో పేర్కొంది.

Huge Explosion in Russia’s Town Bryansk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News