Friday, December 20, 2024

రోడ్లను అక్రమించిన పూల వ్యాపారులకు భారీ జరిమానాలు

- Advertisement -
- Advertisement -

Huge fines for florists who encroach on roads

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లను అక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై జిహెచ్‌ఎంసి కొరఢా ఝూళిపించింది. పలువురు వ్యాపారులకు అధికారులు భారీగా జరిమానాలను విధించారు. గోషామహల్‌లోని జాంబాగ్‌లోని పూల మార్కెట్‌లో వ్యాపారులకు కేటాయించిన స్థలాల్లో కాకుండా రోడ్డును అక్రమించి పలువురు వ్యాపారం చేస్తున్నారు. దీంతో మంగళవారం 84 మంది పూల వ్యాపారులకు రూ.42వేల జరిమానాలను అధికారులు విధించారు. దీంతో చిరు పూల వ్యాపారాలు లబోదిబోమన్నారు. అయితే నిర్ధేశించిన స్థలాల్లోనే వ్యాపారం నిర్వహించుకోవాలని రోడ్లను అక్రమించవద్దంటూ వ్యాపారులతో పాటు అసోసియేషన్‌కు పలుమార్లు సూచనలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడంతో పాటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు.

అయినా వారు రోడ్లను పైనే వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో నిబంధనలకు విరుద్దంగా వ్యాపారం నిర్వహిస్తున్న 84 మందికి జరిమానాలను విధించినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు వెల్లడించారు. అయితే జరిమానాల వసూళ్లుపేరుతో ఏలాంటి రశీదులు ఇవ్వకుండానే డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు పూల వ్యాపారులు ఆరోపించారు. అయితే అలాంటి ఏమి లేదనికావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి వసూళ్లు చేసి ప్రతి పైసా రశీదు ఇవ్వడంతో పాటు జిహెచ్‌ఎంసి ట్రెజరీలో జమ చేశామని వెల్లడించారు. గత ఏఫ్రిల్ నుంచి ఇప్పటీ వరకు రూ.2.50 లక్షలను జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News