Sunday, December 22, 2024

భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

తానూర్ : మండలంలోని బెల్‌తరోడా గ్రామంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన బాయి భోజన్న అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో అపార నష్టం వాటిల్లింది. ఉదయం వేళలో కుటుంబీకులు ఇంట్లో పూజలు నిర్వహించుకొని శుభకార్యానికి హజరయ్యేందుకు భైంసా పట్టణానికి వెళ్లారు. అయితే పూజ కోసం వెలిగించిన దీపం మూలంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలు మొత్తం నివాసం గృహాన్ని వ్యాపించడంతో నష్టం అధికంగా వాటిల్లినట్లుగా సమాచారం.

ప్రమాదంలో ఇంట్లో దాచి ఉంచిన రూ. 7 లక్షలకు పైగా నగదు కాలిబూడిదైంది. బంగారు ఆభరణాలు మంటల దాటికి ముద్దగా మారాయి ఇంట్లోని నిత్యావసర సరుకులు కట్టుబట్టలు సామాగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలు దగ్దమై పనికి రాకుండా పోయాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న భైంసా పైర్ ఇంజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. అప్పటికే ఇంటి లోపలి వస్తువులన్నీ దగ్దమైపోయాయి. సంబంధిత సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు గ్రామానికి చేరుకునే సమయానికి ఇల్లు మొత్తం దగ్దమై అపార నష్టం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కలిచివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News