Saturday, December 21, 2024

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్థానికులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్న సమయంలో ఆర్‌వి ఇంజనీరింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైయ్యాయి.

వారిని వెంటనే ఆంబులెన్స్‌లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు రమణారెడ్డి 47, సతీష్ 45లుగా గుర్తించారు. కాగా మరొకరి పేరు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకొని మంటలు ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News