Thursday, January 23, 2025

శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం గగన్ పహాడ్ లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మకోల్ తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంతో పొగ దట్టంగా కమ్ముకుంది. దీంతో సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. వెల్డింగ్ పనులు చేస్తుండగా థర్మకోల్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ తీగల నుంచి థర్మకోల్ షీట్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News