Thursday, January 23, 2025

సిద్దిపేటలో భారీ ఆగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రై రిసోర్స్ సెంటర్‌లో శనివారం భారీ ఆగ్ని ప్రమాదం సంబంధించింది. ప్లాస్టిక్ కవర్లను డిసిఎం లోకి తరలించే క్రమంలో ఆగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రెండు బేలింగ్ మిషన్లు, రెండు కన్వేయర్ బెల్టులు , రెండు కంప్యూటర్లు ఆగ్నికి ఆహుతి ఆయ్యాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో పైర్ ఇంజన్‌తో మంటలను అదుపు చేశారు.

Also Read: సిఎలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి : బండి

ఒక్కసారిగా మంటలు చెలరగడంతో స్ధానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. వేసవి కాలం కావడంతో ఎండల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ ఆగ్ని ప్రమాదం సంభవించిన పైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సంబందిత అధికారులు సూచించారు. ప్రమాద స్థలానికి హుటాహుటిన మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, పోలీస్ కమిషనర్ శ్వేత చేరుకొని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News