- Advertisement -
జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీధర్ బయోటెక్ రసాయన పరిశ్రమలో ఐదు రియాక్టర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుడు శబ్ధం రావడంతో సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -