Sunday, December 22, 2024

కువైట్ భారీ అగ్నిప్రమాదం.. కేరళకు చెందిన దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

దుబాయ్/కువైట్: కువైట్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. సెలవుల కోసం కేరళకు వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం కువైట్‌కు తిరిగివచ్చిన ఆ కుటుంబం అదే రోజు రాత్రి అగ్నిప్రమాదంలో మరణించింది. కేరళలోని అలప్పుళ జిల్లా నీరట్టుపురానికి చెందిన మాథ్యూస్ ములక్కల్, ఆయన భార్య లీనీ అబ్రహం, వారి ఇద్దరు అగ్ని ప్రమాదంలో మరణించారు. అభ్యాసియా ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో రెండవ అంతస్తులోని ఫ్లాట్‌లో మాథ్యూస్ కుటుంబం నివసిస్తోంది. రాత్రి 8 గంటలకు ఎసిలో షార్ట్ సరూట్ సంభవించి మంగలు చెలరాగాయి.

దట్టమైన పొగలకు ఊపిరిఆడగ దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు మరణించినట్లు అరబ్ టైమ్స్ వార్తాపత్రిక తెలిపింది. మాథ్యూస్ రాయ్‌టర్స్ వార్తాసంస్థలో పనిచేస్తున్నారు. ఆయన భార్య లీనీ అదాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. పిల్లలిద్దరూ కువైట్‌లోని భవన్స్ స్కూలులో చదువుకుంటున్నారు. కేరళలోని నెడుస్సేరీ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం వారంతా కువైట్ తిరిగివచ్చినట్లు పత్రిక తెలిపింది. గత నెలలో కువైట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించి 45 మంది భారతీయులు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News