Monday, January 20, 2025

మంటలకు ఊపిరి ఆడక ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక టైలర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దానా బజార్‌లో ఈ టైలర్ షాపు ఉన్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భవనంలోని కింది అంతస్తులో టైలర్ షాపుతోపాటు ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయని, పై అంతస్తులో ప్రజలు నివసిస్తున్నారని అధికారి తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల రాంతంలో టైలర్ సాపులో హఠాత్తుగా మంటలు చెలరేగాయని, పావుగంట తర్వాత పోలీసులకు సమాచారం అందిందని ఆయన తెలిపారు.

టైలర్ షాపు పైన మొదటి అంతస్తులో నివిస్తున్న ఒక కుటుంబం ఇంట్లోకి దట్టమైన పొగ వ్యాపించిందని, ఊపిరి అందక ఏడుగురు మరణించారని పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా తెలిపారు. మృతులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణం దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News