Sunday, December 22, 2024

పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పాహాల్ కంపెనీ అంతస్థులో మంటలు అంటుకున్నాయి. దీంతో పాహాల్ సిబ్బంది అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. పహల్ ఫుడ్స్ ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు విధుల్లో వంద మంది సిబ్బంది ఉన్నారు. పైఅంతస్థులో ప్యాకింగ్ సామాగ్రి ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అగ్నిప్రమాదం ధాటికి పగుళ్లతో పూర్తిగా పక్కకు భవనం ఒరిగింది. సిబ్బంది అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News