సియోల్ : దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలో ఒక తయారీ కర్మాగారంలో లిథియం బ్యాటరీల పేలుడు వల్ల లేచిన మంటలు ఫ్యాక్టరీని ఆవహించడంతో 22 మంది కార్మికులు మరణించినట్లు, ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చైనీస్ వలస కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు, సియోల్‌కు దక్షిణంగా హ్వాసియాంగ్ నగరంలోని ఫ్యాక్టరీ రెండవ అంతస్తులో సోమవారం ఉదయం సుమారు 10.30 గంటలకు కార్మికులు బ్యాటరీలను పరిశీలించి, ప్యాకేజి చేస్తున్న సమయంలో అవి పేలగా మంటలు ప్రజ్వరిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు సాక్షులను ఉటంకిస్తూ చెప్పారు.
అగ్నిప్రమాద కారణాలను తాము దర్యాప్తు చేయగలమని వారు తెలిపారు, మృతులో 18 మంది చైనీయులు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒక లావోస్ కార్మికుడు ఉన్నట్లు స్థానిక అగ్నిమాపక శాఖ అధిరాని కిమ్ జిన్ యంగ్ తెలిపారు, మృతుల్లో ఒకరి జాతీయతను వెంటనే నిర్ధారించలేకపోయినట్లు ఆయన చెప్పారు, ఎరిసెల్ అనే కంపెనీ యాజమాన్యంలోని ఫ్యాక్టరీల్లో ఒకదానిలో మంటలు మొదలయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయానికి ఫ్యాక్టరీలో మొత్తం 102 మంది పని చేస్తున్నారని కిమ్ తెలిపారు.