Sunday, December 22, 2024

జనగామలో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ మాల్‌ దగ్ధం

- Advertisement -
- Advertisement -

జనగామలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్‌ మాల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో పక్కనున్న 5 షాపులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు.

దాదాపు మూడు గంటలు శ్రమించిన మంటలను ఆర్పారు. అయితే, షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమవ్వడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే కోణం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News