Monday, January 20, 2025

కృష్ణాలో పెరిగిన వరద.. జారాలకు 75వేల క్యూసెక్కులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 105000క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 115.40టిఎంసీలకు చేరింది. రిజర్వాయర్ నుంచి 60వేల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు నుంచి 77353క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి 26767క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 82.16టిఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 46,475క్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో నీటి నిలువ 88.88టిఎంసీలకు చేరుకుంది.

భద్రాచలం వద్ద 25అడుగులకు చేరిన గోదావరి :
గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుతూ వస్తోంది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 25అడుగులకు తగ్గింది. నదిలో 299933క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఎగువన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 6900క్యూసెక్కులు ఉండగా, ఓట్‌ఫ్లో 4000క్యూసెక్కులు ఉంది. రిజర్వాయర్‌లో నీటినిలువ 84.29టిఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4115 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3392క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 36791క్యూసెక్కులు , ఔట్‌ఫ్లో 36484క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ వద్ద లక్ష్మిబ్యారేజ్‌లోకి 144480క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే నీటిని బయటకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి 3207క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రిజర్వాయర్‌లో నీటనిలువ 27.48టిఎంసీలకు చేరింది. నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో 8000 ఉండగా ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది. రిజర్వాయర్‌లో నీటినిలువ 17.80టిఎంసీలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News