Saturday, November 16, 2024

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి.. ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వానలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సామర్థ్యం మించి భారీ వరద ఉదృతి కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా.. 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కడెం ప్రాజెక్టులోకి వస్తోంది.

వరద ప్రవాహం ప్ర‌మాద‌స్థాయికి చేరడంతో ప్రాజెక్టు 14 గేట్లు తెరిచారు. మరో 4 గేట్లు మొరాయించడంతో క్ర‌స్ట్ గేట్లపై నుంచి వ‌ర‌ద‌నీరు పారుతుంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కలెక్ట‌ర్, నీటీపారుద‌ల శాఖ అధికారుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News