Friday, November 22, 2024

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

ఈ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 12,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 1401.30 అడుగులుగా ఉంది. ఇక, నీటి సామర్థ్యం 17.802 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 12.833 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News