- Advertisement -
నిజామాబాద్: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. గోదావరి నది ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 42,605వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 5వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1090.60 అడుగులకు చేరుకుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. పూర్తి నీటి మట్టం 90 టిఎంసిలు ఉండగా, ప్రస్తుతం 88.11 టిఎంసిలుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -