Monday, December 23, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద.. 21 గేట్లను ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 89,094వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 21 గేట్లను ఎత్తి కాకతీయ కాలువకు అంతే క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

కాగా.. ప్రస్తుత, పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు నీరు చేరుకోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 90 టిఎంసిలకు చేరుకుంది. దీంతో నదీతీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చిరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News