- Advertisement -
గత రెండు రోజులుగా మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని ఏడుపాయల శ్రీవనదుర్గభవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నది పొంగిపొర్లుతోంది. శ్రీ వనదుర్గభవాని మాత ఆలయం ముందు నుంచి భారీ నీరు ప్రవహించడంతో అమ్మవారి ఆలయాన్ని బుధవారం కూడా అధికారులు మూసివేశారు.
నీటి ప్రవాహం తగ్గిన తర్వాత యధావిధిగా అమ్మవారిని దర్శించుకోవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అలంకారంతో అలంకరించి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి దర్శనం కోసం రాజగోపురంలో ఏర్పాటు చేసిన శ్రీ వనదుర్గాభవాని మాత ఉత్సవ విగ్రహాన్ని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు
- Advertisement -