Monday, December 23, 2024

ఎత్తిపోతలు షురూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ధర్మారం : పెద్దపల్లి జిల్లా, ధర్మారం మం డలం, నంది మేడారంలోని నంది పంప్‌హౌస్ నుండి శనివారం ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పూర్తిగా నీరు అడుగంటి ఎ డారిగా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రభావం తీ వ్రంగా పెరగడంతో నంది మేడారంలోని నంది పంప్ హౌస్ నుండి ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు నీటి పారుదల శాఖ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. భారీ నీ టిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి భూగర్భం ద్వారా

నంది పంప్‌హౌస్‌లోని స్టోరేజీకి చేరుకున్న నీటిని నాలుగు పంపులను ప్రారంభించి ఒక్కో పంపు ద్వారా 3150 క్యూసెక్కులచొప్పున ప్రతి రో జు 1.2 టిఎంసిల నీటిని దిగువకు వదిలి పెట్టనున్నారు. అదే విధంగా రామడుగు మండలం, లక్ష్మీపూర్‌కు అక్కడి నుండి ఎస్‌ఆర్‌ఆర్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇన్ని రోజులపా టు మూగబోయిన పంపులు ఒక్కసారిగా ప్రారంభం కావడం తో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న నీటిని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్ నూనె శ్రీధర్ తన సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News