Sunday, January 5, 2025

నిండిన కళ్యాణి..

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి వాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్‌లోకి 550 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌కు పూర్తి నీటి మట్టానికి నీరు చేరుకోవడంతో అధికారులు గురువారం ఉదయం ఒక రేడియల్ గేటు ఎత్తివేసి 450 క్యూసెక్కు నీటిని దిగువన గల మంజీరా నదిలోకి వదులుతున్నారు.

100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి మళ్లించారు. ప్రాజెక్ట్ ఎగువ భాగాన గల తిమ్మాపూర్ చెరువు, తాటివాని మత్తడి, కళ్యాణి, భవానీపేట్ తదితర ప్రాంతాల నుంచి వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోని వరద నీటి ఇన్ఫ్లో పెరిగితే మరో గేటు ఎత్తివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 408 మీటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News