Monday, January 20, 2025

శ్రీశైలంకు భారీగా వరద

- Advertisement -
- Advertisement -

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. బుధవారం సాయంత్రం రిజర్వాయర్‌లోకి 1,75,448క్యూస్కెల వరద నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ 80టిఎంసీలకు పెరిగింది.ఉదయం 846అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం సాయంత్రానికే 850అడుగులకు చేరుకుంది. ఎగువన మహారాష్ట్ర ,కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 1.78లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 2లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం నుంచి 2.02లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎగువ నుంచి జూరాలకు 1.65లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 1.50లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మరో వైపు తుంగభధ్ర ప్రాజెక్టుకూ కూడా భారీగా వదర ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి 86633 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 18746క్యూసెక్కులు బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలువ సామర్దం 105టిఎంసీలు కాగా, బుధవారం సాయంత్రానికి 100టిఎంసీలకు చేరుకుంది.

భద్రాచలం వద్ద 10.11లక్షల క్యూసెక్కుల ప్రవాహం:
గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. నదిలో నీటిమట్టం 46.97మీటర్లు ఉండగా , రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువనుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 19500క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 25.17టిఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 9457క్యూసెక్కుల నీరు చేరుతుండగా ,ప్రాజెక్టు నుంచి 13364క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 10164క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టలో నీటినిలువ 12.71టిఎంసీలకు చేరింది.

ప్రాణహితకు తగ్గిన వరద:
గోదావరికి ప్రధాన ఉపనదిగా ఉన్న ప్రాణహితకు వరద స్వల్పంగా తగ్గింది. బుధవారం ప్రాణహిత నుంచి మేడిగడ్డ బ్యారేజికి 7.84లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా ,వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులు తున్నారు. తుపాకుల గూడెం వద్ద సమక్క బ్యారేజి మీదుగా 9.75లక్షల క్యూసెక్కులనీరు ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో నీటిమట్టం 53.85మీటర్లు ఉండగా, నీటి ప్రవాహం 10.22లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News