Tuesday, December 24, 2024

జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు..

- Advertisement -
- Advertisement -

Huge flood water inflow to Jurala Project

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 90,997 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.989 టీఎంసీలుగా ఉంది.ఇక, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లకుగాను ప్రస్తుతం 318.19 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.

Huge flood water inflow to Jurala Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News