Wednesday, January 22, 2025

వరదలతో ఠారెత్తుతున్న ప్రపంచ దేశాలు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం 2024 ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వేడి వాతావరణం (ఎండలు), వర్షాలు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. అయినా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తిలో వెనుకంజ వేయడంలేదు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం లేదు. ఎక్కడ చూసినా ఆహార వృథా, ప్లాస్టిక్ వ్యర్ధాలు, వాయు కాలుష్యం కనపడుతున్నది. ప్రపంచాన్ని కాలుష్యం కమ్మేసింది. కృత్రిమ వర్షాలకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాతావరణ మార్పులకు కారణం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టీవల కాలంలో వానలు, వరదలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్, అఫ్ఘానిస్తాన్ వరదలు మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బ్రెజిల్‌లో ఇప్పటికే 5 లక్షల మంది ఆచూకీ లేదు, కెన్యాలో వరదలు మూలంగా అనేక మంది మరణించడమే కాకుండా అనేక డ్యాం లు కొట్టుకొనిపోయి అనేక పట్టణాలు, నగరాలు విలవిలలాడుతున్నాయి. ఇక ఈ వారంలో అఫ్ఘానిస్తాన్ వరదలు పెద్ద అలజడి సృష్టించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో ఆచూకీ లేకుండా పోయారు. గత సంవత్సరం చైనా ఎన్నడూ లేని విధంగా వరదలు సుడిగుండంలో చిక్కుకుంది. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ కూడా వరదల ప్రభావంతో విలవిలలాడుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి.

అదే సమయం లో భారీ వరదలు పట్టణాలు, నగరాలు ముంచుతూ ఆస్తి నష్టంతో పాటు అనేక మంది మరణాలకు కారణమవుతున్న పరిస్థితి నెలకొంది. వేల మంది నిరాశ్రయులవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘గ్లోబల్ వార్మింగ్’ అని ఇకనైనా ప్రపంచ దేశాలు గుర్తించాలి. తరచూ వాతావరణ మార్పులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం 2024 ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వేడి వాతావరణం (ఎండలు), వర్షాలు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. అయినా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ ఉద్గారాలు ఉత్పత్తిలో వెనుకంజ వేయడంలేదు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం లేదు. ఎక్కడ చూసినా ఆహార వృథా, ప్లాస్టిక్ వ్యర్ధాలు, వాయు కాలుష్యం కనపడుతున్నది. ప్రపంచాన్ని కాలుష్యం కమ్మేసింది. కృత్రిమ వర్షాలకు చేస్తున్న ప్రయత్నాలు కూడా వాతావరణ మార్పులకు కారణం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అడవులు కొండలు గుట్టలు కూల్చివేయడం, అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, ప్రకృతి వనరులు దోపిడీతో మొత్తం ప్రపంచం అంతా విపరీతమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నది. అర్బనైజేషన్, పట్టణీకరణ ఆధునీకరణ ప్రభావం మొత్తం మానవ జీవనంపై ప్రభావం చూపుతుంది. మన దేశంలో కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా కూడా తరచూ వాతావరణ మార్పులు బారిన పడుతున్నాయి. ‘జోషి మఠ్’ ఉదంతం ఇంకా మరవలేదు. ఇటీవల టన్నెల్ ప్రమాదం, ఢిల్లీ వాయు కాలుష్యం, ముంబై, చెన్నై, బెంగళూరు, తరచూ హైదరాబాద్ వాతావరణ మార్పులకు గురవుతూ అనేక ఇబ్బందులుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణ ఏర్పాటుకు కట్టుబడి ఉండాలి. ‘కాప్’ నియమ నిబంధనలు పాటించాలి. దేశంలో నేషనల్ గ్రీన్ కోర్ విధానాలు సూచనలు పాటించాలి.

ప్రకృతి వనరులు దోపిడీ అరికట్టాలి. కొండలు, అడవులను కాపాడుకోవాలి. అటవీ, పర్యావరణ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. మొక్కలు పెంచడం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. వివిధ వ్యర్ధాలను నిర్మూలించాలి. ఆక్రమణాలను అరికట్టాలి. శాస్త్రీయ పద్ధతిలో నగరీకరణ, టౌన్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ఒక్కరూ, ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ ద్వారానే వాతావరణ మార్పులు అరికట్టగలం అనే భావనతో ముందుకు సాగాలి. పకడ్బందీగా చట్టాలు అమలు చేయాలి. వివిధ రకాల వ్యవస్థలు పారదర్శకంగా పని చేయాలి. ఐక్యరాజ్యసమితి, దీని అనుబంధ సంస్థలు కూడా వివక్ష లేకుండా అన్ని దేశాల్లో వాతావరణ, పర్యావరణ చట్టాలు సక్రమంగా అమలు అయ్యేటట్లు చూడాలి. అప్పుడు మాత్రమే ప్రకృతి విపత్తులను అరికట్టగలం.

ఐ ప్రసాద్ రావు
6305682733

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News