Sunday, December 22, 2024

భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గ్రడ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న మత్తుపదార్థాల సరఫరా మాత్రం ఆగడంలేదు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోటు డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం చెక్‌పోస్ట్‌ వద్ద ఎక్సైజ్‌ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. రెండు ఆటోల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 118 కిలోల గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారైయ్యాడు. ఒడిశాలోని కలిమెళ నుంచి గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కట్ లో రూ.31 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News