Sunday, January 19, 2025

బహీరాబాద్‌లో రెండు కోట్ల విలువైన బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

బహీరాబాద్: బహీరాబాద్ అంతర్ రాష్ట్ర ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్‌పల్లి ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. దీంతో ఓ వాహనంలో రెండు బాక్సుల్లో తరలిస్తున్న సుమారు రెండు కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్‌కు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు విచారణలో తేలిసిందని అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News