Wednesday, January 22, 2025

జూన్‌లోనూ భారీగా జిఎస్‌టి వసూళ్లు

- Advertisement -
- Advertisement -

జూన్‌లోనూ భారీగా జిఎస్‌టి వసూళ్లు
రూ.1.60 లక్షల కోట్లు దాటిన పన్ను వసూళ్లు
గత ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరుగుదల
ఈ స్థాయిలో వసూళ్లు ఉండడం ఇది నాలుగో సారి

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. జూన్ నెలకుగాను రూ.1, 61, 497 కోట్లు వసూళ్లు నమోదయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇందులో సెంట్రల్ జిఎస్‌టి రూ.31,013 కోట్లు కాగా, స్టేట్ జిఎస్‌టి కింద రూ.38,292 కోట్లు,ఐజిఎస్‌టి కింద రూ.80, 292 కోట్లు వసూలయినట్లు తెలిపింది.సెస్‌ల వసూళ్లు రూ.11,900 కోట్లు ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూలు కాగా ఈ ఏడాది జూన్‌లో వసూళ్లు 12 శాతం పెరిగాయి.అలాగే జిఎస్‌టి వసూళ్లు లక్షా 60 వేల కోట్లను దాటడం ఇది నాలుగో సారి.

2021 22లో తొలి త్రైమాసికంలో జిఎస్‌టి సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా 2022 23 తొలి త్రైమాసికంలో రూ.1.51 కోట్లకు, 2023 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల జిఎస్‌టి వసూళ్ల విషయానికి వస్తే.. తెలంగాణలో రూ.4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గత ఏడాది రూ.3,901.45 కోట్లతో పోలిస్తే వసూళ్లు 20 శాతం పెరిగాయి.గత ఏడాది ఎపిలో రూ.2.986.52 కోట్లు జిఎస్‌టి వసూళ్లు నమోదవగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.3,477.42 కోట్ల వసూళ్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదయింది. ఇక ఎప్పటిలాగే మహారాష్ట్ర రూ.26,098.78 కోట్ల(17 శాతం వృద్ధి) వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: వైరల్ వీడియో: ధైర్యంలేని ప్రియుడి కంటే.. మనసున్న దొంగే బెటర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News