Monday, December 23, 2024

భారీగా పెరిగిన పెట్రోధరలు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 35 వంతున అమాంతంగా ధరలు పెంచింది. పెంచిన ధరలు ఆదివారం ( జనవరి 29 ) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ఆదివారం ఉదయం టీవీలో ప్రసంగిస్తూ ప్రకటించారు. ఇదే విధంగా కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా లీటర్‌కు రూ. 18 వంతున పెంచినట్టు చెప్పారు. మొత్తం నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచినట్టు ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ. 262.80కు , లీటర్ పెట్రోల్ ధర రూ. 249.80 కు పెరిగింది.

ఇక లీటర్ కిరోసిన్ ధర రూ.189.83 కు, లీటర్ లైట్‌డీజిల్ ధర రూ. 187 కు పెరిగింది. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్లతో పోల్చితే పాకిస్థాన్ రూపీ 11 శాతం పతనమయ్యిందని, దాంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ దరల పెరుగుదలతో పెట్రోల్ బంకుల వద్ద మోటారిస్టులు బారులు తీరినిల్చుండడం కనిపించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంధనం ధరల పెంపుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘దిగుమతి అయిన ప్రభుత్వం’ తాలూకు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ పూర్తిగా లోపించడమే ఈ పరిస్థితికి దారి తీసిందన్నారు. ఇది జనాలను , వేతన జీవులను పీల్చి పిప్పిచేయడమేనని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణంతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రజానీకానికి ప్రభుత్వం ఇప్పుడు మరింత శిక్ష వేసిందని మాజీ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News