Monday, December 23, 2024

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రపంచ ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ సంస్థ హైదరాబాద్‌లోని  జీనోమ్ వ్యాలీలో రూ.1,800 కోట్ల పెట్టుబడితో 3 యూనిట్లను ఏర్పాటు చేయనున్నది.  టీకాలు, ఎపిఐలు, ఫార్ములేషన్ల తయారీ కోసం పెట్టుబడులు పెట్టునున్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ తో భేటీ అనంతరం బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల ఈ విషయాన్ని ప్రకటించారు. 2,500 మందికి పైగా ఉపాధిని కల్పించే ఉద్దేశంతో కంపెనీని విస్తరిస్తామని ప్రణాళికలను సంస్థ ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సంచాలకులు శక్తి నాగప్పన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News