Wednesday, January 22, 2025

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడిసి) ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించగా, తాజాగా మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్‌అండ్‌డి సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.

ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. మెడ్‌ట్రానిక్స్ నిర్ణయంపట్ల మంత్రి కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, అమెరికా వెలుపల వెడ్‌ట్రానిక్స్ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తుండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News