Wednesday, January 22, 2025

జపాన్ బీచ్‌లో భారీ ఇనుప గుండు?!

- Advertisement -
- Advertisement -
హమామత్సు నగరంలో తుప్పు పట్టిన ఓ ఇనుప గుండు సముద్రతీరంలో కొట్టుకువచ్చింది. దాంతో అక్కడి స్థానికులకు మతి చెదిరినంత పనైంది.

టోక్యో: జపాన్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ ఇనుప గుండు రోజుల తరబడి అక్కడ ఉండడంతో అనేక ఊహాగానాలకు దారితీసింది. అది ‘యుఫో’(అన్ ఐడెంటిపైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) అయి ఉంటుందా, పేలుడు పదార్థమా, గూఢచర్య పరికరమా? అంటూ ఎవరికివారు ఊహాగానాలు చేశారు.

చైనా గూఢచారి బెలూన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌లోని హమామట్సు నగరంలోని ఎన్షు బీచ్‌కు ఇనుప గుండు కొట్టుకురావడంతో జపాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచి, ఆ గోళాన్ని పరిశీలించారు.

తుప్పు పట్టిన ఆ ఇనుప గుండును ఎక్స్‌రే తీసి చూస్తే అది సముద్రంలో కొట్టుకు వచ్చిన మందుపాతర గుండు మాత్రం కాదని కనుగొన్నారు. పైగా అదో స్క్రాప్ మెటల్ అని తేలింది. కాగా ఒకానొక కాలంలో లంగరు వేయడానికి ఉపయోగించే ‘బోయ్’(buoy) అని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. కాగా నిపుణులు మాత్రం ఇటువంటి పరికరాలను సాధారణంగా షిప్పింగ్, సముద్ర పరిశోధన కోసం ఉపయోగిస్తారని, జపాన్ స్పందన భిన్నంగా ఉందని భావించారు.
‘అమెరికాలో బెలూన్ల కారణంగా ప్రతి ఒక్కరూ కంగారు పడినట్లుంది’ అని అమెరికాలోని సముద్ర శాస్త్రవేత్త ఉవే సెండ్ ‘ద టైమ్స్’తో అన్నారు.

ఇదిలావుండగా చైనా తాను ప్రయోగించిన బెలూన్లు కేవలం వాతావరణ పరిశోధనలకు సంబంధించింది అని పేర్కొంది. పైగా అమెరికాయే తమ ప్రాంతానికి గూఢచర్య బెలూన్లను పంపుతోందని అన్నారు. బెలూన్ల కారణంగా చైనా, అమెరికా వంటి సూపర్ పవర్స్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దాంతో అమెరికా తన విదేశాంగ మంత్రి అంతోని బ్లింకెన్ చైనా పర్యటనను కూడా రద్దు చేసిందన్నది తెలిసిన విషయమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News