Sunday, November 3, 2024

తల్లడిల్లిన ఢిల్లీవాలా

- Advertisement -
- Advertisement -

కిసాన్ ఆందోళన్‌తో బంపర్ బంపర్‌జామ్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) మంగళవారం దారుల పొడవునా ట్రాఫిక్ జాంలతో స్తంభించింది. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలిరావడంతో పలు చోట్ల వాహనాలు నత్తనడకన సాగాల్సి వచ్చింది. రైతుల ప్రదర్శనను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు బహుళ స్థాయి , పలు వలయాల ఆంక్షలను విధించాయి. సింఘూ , టిక్రి సరిహద్దులలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఢిల్లీకి దారితీసే ప్రతి రోడ్డు ఇప్పుడు భద్రతా ఏర్పాట్లతో ఉండటంతో ఉద్యోగాలు చేసుకునే వారు, రోజువారి కార్యక్రమాలపై వెళ్లేవారు నానా ఇక్కట్లకు గురిఅయ్యారు.

నోయిడా, ఢిల్లీలను కలిపి సాగే రహదారులపై ఆంక్షలతో ఉద్యోగులకు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న తమ వారిని చూసేందుకు తరలిరాగా మధ్యలోనే నిలిచిపోవల్సి వచ్చిందని ఉత్తరాఖండ్ నివాసి అరుణ్ సింగ్ తెలిపారు. రోడ్లపై వాహనాలు తగిలేరీతిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉదయం ఏడు గంటల నుంచే ఈ పరిస్థితి ఏర్పడింది. ఐటి ఉద్యోగుల ఏ విధంగా కూడా సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేదు.

దీనితో వారిలో చాలా మంది వాహనాలలో ల్యాప్‌ట్యాప్‌లకు పని చెప్పారు. ఉత్తరాఖండ్, యుపి ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి సాగే రాదార్లన్నింటిపైనా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచింది. కాగా ఢిల్లీలోని పలు సంస్థలకు చెందిన వారు రైతాంగానికి సంఘీభావం తెలిపేందుకు సరిహద్దులకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రైతులకు మద్దతు తెలియచేయడం తమ బాధ్యత అని వారిలో కొందరు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News